పోటీ పరీక్షలతో సృజనాత్మక శక్తి పెంపు
కొల్లాపూర్: విద్యార్థుల్లో సృజనా త్మక శక్తి పెరిగేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయని అక్షర గ్రామర్ హైస్కూల్ నిర్వాహకుడు నరేష్ వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ మండలంలోని ఎల్లూ రు అక్షర గ్రామర్ హైస్కూల్‌లో విద్యార్థులు స్పెల్‌బీ ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించారు. పలువురు విధ్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఈ పరీక్షలు దోహ దపడుతాయని వివరించారు. స్పెల్‌బీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ఆయన తెలిపారు.


