అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
నారాయణపేట: జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యలో భాగంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. వారి వద్ద 12.4 కేజీల గంజాయి, రూ.10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకొని 10 మంది నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సోమ వారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడించారు. కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణ మండలంలోని కున్సి గ్రామ శివారులో ఎస్‌ఐ నవీద్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపంచడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, గంజాయిని నారాయణపేట జిల్లాకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు పోలీసు బృందం కృష్ణ రైల్వేస్టేషన్ వద్ద మరో ఐదుగురిని అరెస్టు చేశారన్నారు. విచారణలో నిందితులు మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్, కర్ణాటకలోని యాదగిర్ జిల్లాల నుంచి గంజాయిని రవాణా చేసి తెలంగాణ రాష్ట్రంలో చిన్న పాకెట్లలో విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. రెండు సంవత్సరాలుగా ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల్లో ఒకరైన సుఫియాన్‌షాకు నారాయణపేటలో గతంలో నమోదైన కేసులో ప్రమేయం ఉందన్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో మక్తల్ సీఐ రామ్‌లాల్, కృష్ణ ఎస్‌ఐ నవీద్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోప్యనాయక్, రాఘవేంద్రగౌడ్, రామస్వామి, అశోక్‌కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారని త్వరలో వారికి రివార్డు అందజేయనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
నిందితుల వివరాలు..
సయ్యద్ అజార్ అలీ, నారాయణపేట, మొహమ్మద్ సుఫియాన్‌షా– నారాయణపేట, క నిగిరి విశాల్– నారాయణపేట, కర్ణాటకలోని యాద్గీర్‌కు చెందిన ఉమేష్, సోనియా, లల్లన్, స మీర్ సయ్యద్, మహరాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వారు తుకారాం, సమీర్, అక్షయ్‌లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.


