త్రుటిలో తప్పిన ప్రమాదం
గండేడ్: మీర్జాగూడ వద్ద ఎదురెదురుగా వచ్చిన కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. గండేడ్ మండలం కప్లాపూర్ వాసి ఆ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కప్లాపూర్ గ్రామానికి చెందిన ఆర్. వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్. ఇతను ఏఆర్‌లో పనిచేస్తూ తాండూర్ మాజీ మంత్రి, చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వికారాబాద్‌లో ఉంటూ అక్కడి నుంచి రోజు హైదరాబాద్‌కు వెళ్లి విధులకు హాజరయ్యేవాడు. సోమవారం తన రిలీవర్ విధుల నుంచి దిగనుండడంతో ఇతను విధుల్లో చేరేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు వికారాబాద్‌లో బస్సెక్కాడు. చేవేళ్ల పరిదిలోని మీర్జాగూడకు రాగానే కంకర లోడుతో ఉన్న టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఈప్రమాదంలో చాలా మంది అక్కడికక్కడే మృతిచెందగా హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్యకు తల, కాలు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట అతడిని చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ మహేందర్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడతానని అనుకోలేదని, భగవంతుడే తన ప్రాణాలు కాపాడడని బాధితుడు వెంకటయ్య తెలిపారు.
మీర్జాగూడ బస్సు ప్రమాదంలో
కానిస్టేబుల్ వెంకటయ్యకు తీవ్రగాయాలు
మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న వైనం
త్రుటిలో తప్పిన ప్రమాదం


