ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లావాసులు
మహబూబ్‌నగర్ క్రీడలు: చైన్నెలో మంగళవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు జ రిగే ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు జిల్లావాసులు పా ల్గొంటున్నారు. జిల్లాకు చెందిన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మల్లికార్జున్, హైదరాబాద్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ప నిచేస్తున్న అమర్‌నాథ్ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడా ది మే నెలలో బెంగళూర్‌లో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో మల్లికార్జున్ 60+ఏళ్లపై బడిన విభాగంలో, అమర్‌నాథ్ 45+ ఏళ్ల పైబడిన విభాగంలో 1500 మీ., 5000 మీ. పరుగులో నాలుగో స్థానంలో నిలిచి.. ఏషి యన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారు.
దేవరగుట్ట..
చిరుతల గుట్టయింది!
● మూడురోజులుగా చిరుతల మకాం
నవాబుపేట: మండలంలోని యన్మన్‌గండ్ల సమీపంలోని దేవరగుట్ట కాస్తా తాజాగా చిరుతల గుట్టగా మారింది. మూడురోజుల క్రితం దేవరగుట్టలో చిరుతల సంచారం మరోసారి కనిపించింది. మూడు నెలల క్రితం ఇక్కడే మాకాం వేసి దాదాపు రెండు నెలలు అడపా దడపా కనిపిస్తూ భయబ్రాంతులకు గురిచేసింది. తాజాగా మూడు రోజులుగా చిరుత అదే గుట్టలో సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలే దేవరగుట్ట గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండటం పైగా గ్రామస్తులు పొలాలకు వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఈ గుట్ట ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పొలాల మధ్య ఉన్న గుట్టచెంత చిరుత సంచారంతో జనం వనికిపోతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి వెంటనే గుట్ట చెంత చిరుతలకు బోన్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామప్రజలు కోరుతున్నారు.
ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లావాసులు
ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లావాసులు


