అర్హులకే సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అర్హులైన మత్స్యకారులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా సంఘం సభ్యులు చురుగ్గా పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడి (పర్సన్ ఇన్‌చార్జ్)గా గోనెల శ్రీనివాస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులపై ఆధారపడిన మత్స్యకారుల ఆదాయ వృద్ధి, మార్కెట్ విస్తరణ, ఉపాధి సృష్టిలో సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, నాయకులు కృష్ణయ్య, టంకర కృష్ణయ్యయాదవ్, మహేందర్, యాదయ్య, శరత్, ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, స్వరూప, రంజిత్‌కుమార్, లింగంనాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


