గుమ్మకొండ తండాలో విషాదం | - | Sakshi
Sakshi News home page

గుమ్మకొండ తండాలో విషాదం

Oct 19 2025 7:21 AM | Updated on Oct 19 2025 7:21 AM

గుమ్మకొండ తండాలో విషాదం

గుమ్మకొండ తండాలో విషాదం

తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండ తండాకు చెందిన శంకర్‌ నాయక్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శంకర్‌నాయక్‌ పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించడంతో శుక్రవారం రాత్రి శంకర్‌ నాయక్‌ మృతదేహాన్ని శనివారం తండాకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, తండావాసుల రోదనలతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నా యి. కాగా శంకర్‌ నాయక్‌ మరణవార్త తెలుసుకున్న మరికల్‌ చైటచెరువు తండాకు చెందిన రామునాయక్‌, మంజుల దంపతులు అంత్యక్రియల నిర్వహణకు గాను మృతుడి కుటుంబానికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు.

డీసీఎం, కారు ఢీ:

ఇద్దరి దుర్మరణ ం

వనపర్తి రూరల్‌: ముందు వెళ్తున్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన నాగరాజు (డ్రైవర్‌), కొంపల్లికి చెందిన మనీష్‌, విశాల్‌, రాజేష్‌ బ్యాండ్‌ మేళం వాయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వీరు బ్యాండ్‌ మేళం వాయించడానికి కర్నూల్‌కు వెళ్తున్నారు. మార్గ మధ్యలో పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై నందగోపాల్‌ హోటల్‌ సమీపంలోకి రాగానే తెల్లవారుజామున 3.30కు వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎం సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో నాగరాజు (24), మనీష్‌ (24) అక్కడిక్కడే మృతి చెందారు. విశాల్‌, రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జంగాల రాజేష్‌ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ఊట్కూరు: మండలంలోని నిడుగుర్తిలో శనివారం ఇంటి దగ్గర ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతిచెందగా.. మరొకకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతమ్మ(55) అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంటికి పెరుగు కోసం వెళ్లింది. పెరుగు తీసుకొని కృష్ణారెడ్డి కూతురు మంజులతో మాట్లాడుతూ.. ఎదురుగా ఉన్న అరుగులపై కూర్చుంది. అప్పు డే పొలానికి వెళ్లేందుకు ఆంజనేయులు ట్రాక్టర్‌ను స్టార్ట్‌ చేయగా.. వేగంగా వెళ్లి ఇద్దరు మహి ళలపై దూసుకెళ్లిది. అనంతమ్మ, మంజులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అనంతమ్మ మృతిచెందింది. మంజుల కాలు విరిగింది. ఈ విషయమై మృతురాలి మేనల్లుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

పురుగు మందు తాగి.. వ్యక్తి బలవన్మరణ ం

భూత్పూర్‌: మండలంలోని పోతులమడుగుకు చెందిన ఖాసీం (48) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఖాసీం వ్యవసాయ కూ లీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం ఉదయం కోట్ల నారాయ ణ వ్యవసాయ పొలంలో పనికి వెళ్తున్నానని భా ర్య సుజాతతో చెప్పి వెళ్లాడు. ఖాసీం స్నేహితుడు జోగు చెన్నప్ప కూడా పనినిమిత్తం కోట్ల నారాయణ పొలం వద్దకు వెళ్లగా ఖాసీం చలికి వణుకుతున్న స్థితిలో కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా ఆర్ధిక పరిస్ధితి బాగా లేకపోవడంతో పురుగు మందు తాగినట్లు ఖాసీం చెప్పాడు. దీంతో చెన్నప్ప వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆస్పత్రికి తరలించారు. పరి స్థితి విషమించడంతో ఖాసీం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement