
ఉత్సాహంగా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంరటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లా స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్‌బాక్సింగ్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్‌లో ఉమ్మడి జిల్లాతో వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది బాలికలు పాల్గొన్నారు. పోటీలను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రీడలను ప్రాక్టిస్ చేయాలని తద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు. మహబూబ్‌నగర్ క్రీడాపోటీల నిర్వహణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. డీవైఎస్‌ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా కిక్‌బాక్సింగ్ సిటీ లీగ్ పెట్టడం జరిగిందన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో వుమెన్స్ కిక్‌బాక్సింగ్ లీగ్‌లు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిభచాటిన వారు త్వరలో జరిగే జోనల్ స్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని చెప్పారు. జోనల్ స్థాయిలో మెడల్స్ సాధించేవారు జాతీయస్థాయి పోటీలకు వెళ్తారని, నగదు పారితోషికాలు ఉంటాయన్నారు. నిరంతరం కిక్‌బాక్సింగ్ ప్రాక్టిస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్సోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, రవినాయక్, భరత్, కనకం యాదవ్, శేఖర్, నర్సింగ్‌రావు, తిరుపతి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల వివరాలు..
పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాలు, టీం వెపన్, టీం కతాస్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రియేటివిటీ ఫాంలో మహబూబ్‌నగర్ జట్టు భావన వర్షిణి, కె.క్రితిజ్ఞ, రిత్వికారెడ్డి ప్రథమ (మహబూబ్‌నగర్) ప్రథమ, శ్రీహిత, అవిశృతి– ద్వితీయ (మహబూబ్‌నగర్), హార్డ్ స్టైల్ ఫాంలో రితిక ప్రథమ, గోమతి (ద్వితీయ), ఆరోహి (తృతీయ), మ్యూజికల్ ఫాంలో హారికారెడ్డి ప్రథమ, వర్షిణి ద్వితీయ స్థానాల్లో నిలిచారు.