
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బల్మూర్: ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పంజుగుల మనోహర్(24) ఐదేళ్లుగా ఆటో నడుపుతై జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి ఇటీవల అనారోగ్యంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఐదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి బాత్రూంకు వెళ్లి ఎంతకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించిగా ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి సుల్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
హన్వాడ: మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కమ్మరి వెంకటేష్ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అప్పులు కూడా పెరిగడంతో వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇటీవలే కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. శుక్రవారం తాను నిర్వహిస్తున్న కార్పెంటర్ షాపునకు వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఇంటికి రాకపోవడంతో భార్య సుకన్య షాపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో వెంకటేష్ విద్యుత్ వైర్లతో ఉరేసుకుని మృతి చెందడాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించింది. ఎస్‌ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వరకట్న వేధింపులు
తాళలేక ఆత్మహత్య
జడ్చర్ల: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శికార్‌గానిపల్లిలో చోటుచేసుకుందని సీఐ కమలాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శికార్‌గానిపల్లికి చెందిన మండ్ల శైలజ అలియాస్ గుడిసె లాస్య(27) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మూసాపేట మండలం జానంపేటకు చెందిన వెంకటేశ్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ముగ్గురు కుమారులు అనారోగ్యానికి గురైనా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వరుసగా మృతిచెందారు. దీంతో లాస్య శికార్‌గానిపల్లిలోని తల్లి మండ్ల జయమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. తనకు అదనంగా కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారకుడైన వెంకటేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాస్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.