
తల్లిదండ్రులకు పాదపూజ
అడ్డాకుల: మండలంలోని కందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మా తృపూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడే తపణను ఆయన వివరించారు. హెచ్‌ఎం మురళీధర్, నిర్వాహకులు అని ల్ భగవత్, సంభూపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్‌శర్మ, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్, విజయ్‌కుమా ర్, జయశ్రీ, శ్రీదేవి, గోపాల్, నాగమణి, అనిత పాల్గొన్నారు.