
ప్రతి ఒక్కరూ హస్తకళల్లో నైపుణ్యం సాధించాలి
● టీజీ హస్తకళ శాఖ
అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల
బల్మూర్: ప్రకృత్తిలో లభించే మట్టి, చెట్లు, రాళ్లతో అనేక రకాల వస్తువులు తయారు చేసే హస్త కళాకారుల నైపుణ్యతను ప్రోత్సహించాలని తెలంగాణ హస్తకళల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సూ చించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్రం తెలంగాణ హస్తకళల డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మూడురోజుల అవగాహన, వర్క్‌షాప్ కా ర్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు హస్తకళలతో నేర్చుకోవాలని సూ చించారు. హస్తకళలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ చాటుతున్న యువతి, యువకులను గుర్తించి వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించి గుర్తింపుకార్డులతోపాటు ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ హస్తకళలపై అభిరుచి పెంచుకోవాలని కోరారు. దేశంలో హస్తకళలకు ఉన్న గుర్తింపుతో భవిష్యత్‌లో ఈ రంగంలో రాణిస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. మూడురోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో క్రోచ్ వర్కు, హాండ్ ఎంబ్రాయిండరీ, వెదురు పనిముట్లపై వర్క్‌షాప్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు నిమ్మలపద్మ, వెంకటమ్మ, మౌనిక, శ్రీబిఫిన్‌పాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.