
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే నివాసంలో కురుమూర్తి స్వామి ఆలయ పాలక మండలితో కలిసి స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆలయం వద్ద కొనసాగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా జరుపుకుందామన్నారు. అందుకు ఆలయం వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలక మండలి సభ్యులు, తదితరులు ఉన్నారు.