
ఈగలపెంట వద్ద..
దోమలపెంట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్‌ఎస్‌జీ అధికారుల ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వి.వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పోలీసులు ఈగలపెంటలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించారు. ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాలన్నింటిని జెన్‌కో గ్రౌండ్‌లోకి మళ్లించి అక్కడే నిలిపి వేశారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సున్నిపెంట నుంచి ప్రధానమంత్రి హెలికాప్టర్‌లో బయలుదేరిన తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగించారు. ఈగలపెంట ఎస్‌ఐ జయన్న ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఏపీ పోలీసులకు సహకరించారు.