
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్‌దాస్ తెలిపారు. అలంపూర్ పట్టణంలోని పాపనాశిని ఆలయాల్లో గార్డెన్ పనులను గురువారం కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల సముదాయాన్ని కేంద్ర పురావస్తు శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో అభివృద్ధికి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా రూ. 20 లక్షలతో పను లు ప్రారంభించామని తెలిపారు. పాపనాశిని, సంగమేశ్వర ఆలయాల ప్రాముఖ్యత భక్తులకు, పర్యాటకుల తెలిసే విధంగా ప్రచార చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి 5వ శక్తి పీఠ క్షేత్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఆలయాల సందర్శన
అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయాలను కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ నిఖిల్‌దాస్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈఓ దీప్తితో కలిసి ఆలయాల్లో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. వీరితో పాటు కేంద్ర పురాతత్వ శాఖ కన్సర్వేషన్ అసిస్టెంట్ వెంకటయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.