
ఉల్లి క్వింటా రూ.1,900
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర క్వింటాకు గరిష్ఠగా రూ.1900 వరకు పలికింది. కనిష్ఠంగా 1200 వరకు ధరలు నమోదయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఉల్లి ధరులు అటుఇటుగా నిలకడగానే ఉన్నాయి. సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరల్లో మార్పురాలేదు. మార్కెట్‌కు కొత్త ఉల్లి వచ్చినప్పటికీ పాత ఉల్లికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. నాణ్యంగా ఉన్న ఉల్లికి గరిష్ఠ ధరలు పలుకగా, రెండో రకం ఉల్లికి కనిష్ఠ ధరలు వచ్చాయి. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.950, కనిష్ఠంగా రూ. 600వరకు పలికింది. కొత్త ఉల్లి నాణ్యతగా లేకపోవడంతో కొనేవారు లేక తిరిగి వాపసు తీసుకుపోయారు.
హంస రకం రూ.1,809
దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లల్లో హంస ధాన్యం ధర క్వింటాకు గరిష్ఠంగా రూ.1809గా ఒకే ధర లభించింది. మార్కెట్‌కు రెండు వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
వ్యక్తి ఆత్మహత్య
ఆత్మకూర్: కుటుంబ కలహాలతో ఓవ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూరాలకు చెందిన కుర్వగట్టు ఆంజనేయులు(38) భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాద్‌కు వెళింది. ఇది జీర్నించుకోలేని ఆంజనేయులు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.