
ఢీఎంఎఫ్‌టీ..!
మహబూబ్‌నగర్
జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీరుపై రగడ
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ)కు సంబంధించి చెలరేగిన వివాదం ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. పలు అభివృద్ధి పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి లేఖ ఆలస్యంగా వెలుగుచూడగా.. చర్చనీయాంశమైంది. నియోజకవర్గ శాసనసభ్యుడిగా, డీఎంఎఫ్‌టీ సభ్యుడిగా ఉన్న తనకు సమావేశంపై సమాచారం ఇవ్వలేదు.. మీటింగ్ మినిట్స్ కూడా అందజేయలేదని అందులో పేర్కొనగా.. రగడ రాజుకుంది.
నిబంధనలకు విరుద్ధంగా..
జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో చైర్మన్/చైర్‌పర్సన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సెక్రటరీగా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ), కోశాధికారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల్లోని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు/జెడ్పీ చైర్‌పర్సన్లు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి సమావేశం నిర్వహించి.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశాలతో అధికారులు పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపు చేపట్టాలి. కానీ.. గద్వాల జిల్లాలో ఇలా జరగలేదని కలెక్టర్ బీఎం సంతోష్‌కు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది.
పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపుపై వివాదం
తనకు తెలియకుండానే చేయడంపై అలంపూర్‌శాసనసభ్యుడి అసంతృప్తి
జోగుళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన లేఖ
నియోజకవర్గ నేత ‘హస్తమే’ కారణమంటూ ఊహాగానాలు
కమీషన్లే కారణమని విమర్శలు..