
భోజనం కలుషితమైతే ఎవరు బాధ్యులు
భూత్పూర్: విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో క్రిమి, కీటకాలు పడి కలుషితమైతే ఎవరు బాధ్యులని కలెక్టర్ విజయేందిరబోయి అసహనం వ్యక్తం చేశారు. భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బుధవారం మధ్యాహ్న భోజనం చెట్ల కింద తింటుండగా గమనించిన కలెక్టర్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని, చెట్ల కింద భోజనం ఎలా పెడుతారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనాన్ని బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయులు ఎవరని హెచ్‌ఎంను ప్రశ్నించారు. హెచ్‌ఎం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఇలాంటి పరిస్థితి మరోసారి రానివ్వరాదని హెచ్చరించారు.
హాస్టళ్లలో మెనూ పాటించకుంటే చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ కచ్చితంగా పాటించాలని, పాటించని హాస్టళ్లపై చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారం ప్రభుత్వం జారీచేసిన మెనూ ప్రకారం అదించాలన్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు హాస్టల్ వార్డెను అందుబాటులో ఉండాలని, బాలికల హాస్టల్‌లో వాచ్‌మెన్‌కు వదిలేసి వెళ్తున్నారని విమర్శించారు. స్టోర్‌రూమ్‌లో కూరగాయలు పప్పులు, పాలు ఇతర సామగ్రి అందుబాటులో ఉండడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్, జిల్లా మైనార్టీ అధికారి శంకరాచారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్సీ సంక్షేమాధికారి సునీత ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి
భూత్పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో
చెట్లకింద విద్యార్థుల భోజనం
ఉపాధ్యాయుల పనితీరుపై
కలెక్టర్ ఆగ్రహం