
టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కుమారలింగంపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 వరకు ఉపన్యాసాలు, భజనలు, కుంకుమ పూజా కార్యక్రమాలు ఉంటాయని, ఈనెల 21 నుంచి 25 వరకు జిల్లాలోని దేవరకద్ర మండలం అజిలాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజ, ఈనెల 31, 31 తేదీల్లో గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వారి సేవకులు కేశవు లు, పాండురంగం, సురేష్‌చందర్‌దూత్, హనుమంతురెడ్డి, పల్లాటి తారకం, రాములు, ఏనుగొండ నర్సింలు, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీలు
మహబూబ్‌నగర్ క్రైం: ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ సేవలు– త్యాగాలు ప్రజా రక్షణపై ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని, ప్రతిఒక్కరూ మూడు ఫొటోలు పంపాలన్నారు. షార్ట్‌ఫిలీం పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత– సమాజ రక్షణ అనే అంశంపై ఈ నెల 23 వరకు పంపించాలన్నారు. మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లలో మీ పూర్తి వివరాలతో ఫొటోలు, షార్ట్‌ఫిలిం వీడియోలు పంపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న మూడు ఉత్తమ ఫొటోలు, షార్ట్‌ఫిలింలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, జిల్లాలోని విద్యార్థులు, యువత ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.