
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో పోలీస్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పారదర్శకత, సమయపాలన తప్పక పా టించాలని ఎస్పీ జానకి అన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రతి వి భాగంలో ఉండే సిబ్బంది ప్రత్యేక దృష్టితో విధులు చేపట్టాలని, ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నవాటిని అమలు చేసి ప్రతి వారానికి నివేదిక సమర్పించాలన్నారు. సీసీటీఎన్‌ఎస్ అప్‌డేట్స్ సమయానికి నమోదు చేసి పెండింగ్ ఎఫ్‌ఐఆర్‌లు, చార్జీ షీట్లు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించి, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి అంశాలపై ప్ర త్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి సర్కిల్ స్థాయిలో రోడ్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఎక్కు వగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన నివా రణ చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానితులు, రౌడీషీటర్స్ నిఘా పెట్టడంతోపాటు తిరిగి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదృశ్య కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రజా పోలీసింగ్ బలపరచాలని ఆదేశించారు.