
రైల్వే ఉద్యోగిని మోసం చేసిన సైబర్ నేరస్తులు
నాగర్‌కర్నూల్ క్రైం: వాట్సప్‌లో వచ్చిన ట్రెండింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ మొ త్తంలో నగదు వస్తుందని పెట్టుబడి పెట్టిన రై ల్వే ఉద్యోగిని సైబర్ నేరస్తులు మోసం చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన తిరుపతయ్య రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు తన ఫోన్‌లోని వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో ట్రెండింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని నమ్మి ఈ ఏడాది ఆగస్టు రూ. 13.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టాడు. తాను పెట్టుబడి పెట్టిన నగదు రాకపోవడంతో వాట్సప్‌కు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయడంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లక్ష్మమ్మకు మాజీ
మంత్రుల ఘన నివాళి
తిమ్మాజిపేట: మాజీ మంత్రి డా. ఆవంచ లక్ష్మారెడ్డి తల్లి లక్ష్మమ్మ ఈ నెల 1న హైదరాబాద్‌లో మృతిచెందగా.. స్వగ్రామం ఆవంచలో దహన సంస్కారాలు నిర్వహించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన దశదినకర్మలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలుజల్లి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, యాదయ్య, శ్రీశైలంయాదవ్, దయాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌గౌడ్, మోహనాచారి, అజయ్, ఊషన్న, కృష్ణయ్య, ఇబ్రహీం, స్వామి, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.