
ఎట్టకేలకు శుభ్రం చేశారు..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక ఎస్‌ఆర్‌నగర్ పక్కన ఖాళీ స్థలంలో గుట్టలు గుట్టలుగా పోగైన చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను ఎట్టకేలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. నగరంలోని ఈ ప్రాంతంతో పాటు వివిధ చోట్ల ఎక్కడబడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను కొందరు వ్యక్తులు యథేచ్ఛగా పారబోస్తున్న వైనంపై ‘సాక్షి’లో శనివారం ‘పొడి.. తడబడి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన వారు ఎస్‌ఆర్‌నగర్ వద్ద పారబోసిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించి ట్రాక్టర్ ద్వారా కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలించారు. అలాగే జేసీబీతో ఆ ప్రాంతం మొత్తం చదును చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అయితే మిగతా ప్రాంతాల్లో ఉన్న అపరిశుభ్రతను తొలగించడంపై మాత్రం దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

ఎట్టకేలకు శుభ్రం చేశారు..!