
వాలీబాల్ టోర్నీ విజేత మహబూబ్‌నగర్
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 ఉమ్మడి జిల్లా బాల బాలికల వాలీబాల్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్లు విజేతగా, నాగర్‌కర్నూల్ జట్లు రన్నరప్‌గా నిలిచాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ జిల్లాల క్రీడా జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బాదేపల్లి ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.కృష్ణ , క్రీడాకమిటీ అధ్యక్షుడు కృష్ణ, ఇతర కమిటీ బాధ్యులు జ్ఞాపికలు అందజేశారు. అలాగే అన్ని జిల్లాల నుంచి చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ జట్టు ఈ నెల 16న జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననుంది. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్న వీరయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు డి.నిరంజన్, పీడీలు వడెన్న, రాంకళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ టోర్నీ విజేత మహబూబ్‌నగర్