బాలికపై లైంగిక దాడి | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Oct 14 2025 7:47 AM | Updated on Oct 14 2025 7:47 AM

బాలిక

బాలికపై లైంగిక దాడి

చిన్నచింతకుంట: ఇన్‌స్ర్ట్రాగామ్‌ పరిచయం ప్రేమగా మారి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. బాలికకు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బోజతండాకు చెందిన చందర్‌నాయక్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో చందర్‌నాయక్‌ సదరు బాలికను ప్రేమిస్తున్నానని వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు చిన్నచింతకుంట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చందర్‌నాయక్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

జాతీయస్థాయి

అథ్లెటిక్స్‌కు జిల్లా విద్యార్థిని

కందనూలు: ఒడిశా రాష్ట్రంలో ని భువనేశ్వర్‌లో త్వరలో నిర్వహించే 40వ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లాకు చెందిన కొడావత్‌ స్వప్న ఎంపికై ందని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు విజేందర్‌ యాదర్‌ సోమవారం తెలిపారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీలో జరిగిన 11వ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో విద్యార్థిని స్వప్న విశేష ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు.

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌

రెఫరీగా హైదర్‌ పాషా

ఎర్రవల్లి: మండల కేంద్రానికి చెందిన సయ్యద్‌ హైదర్‌ పాషా జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ రెఫరీగా ఎంపికయ్యారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన టీఏఏ సెమినార్‌లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీ య స్థాయి అథ్లెటిక్స్‌ రెఫరీగా ఎన్నికయ్యారు. ఈ నెల 16 నుంచి 18వరకు హన్మకొండలో నిర్వహించనున్న 5వ అండర్‌–23 నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్షిప్‌లో అథ్లెటిక్స్‌ త్రోస్‌కు ఆయన ప్రాతినిథ్యం వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పదో బెటాలియన్‌లోని సాయిధ చైతన్య పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సభ్యులు, వ్యాయామ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.

మూఢనమ్మకాల పేరుతో

మోసం: నలుగురు అరెస్ట్‌

మదనాపురం: మూఢనమ్మకాల పేరుతో మదనాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్యం చెప్తాననే ప్రకటన ద్వారా బాధితుడిని నమ్మించి, దుష్టశక్తులు ఉన్నాయంటూ అష్టదిగ్బంధన పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబ లికాడు. మొత్తం రూ.5.66 లక్షలు వసూలు చేశాడు. మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఊరగోపి పల్నా డు జిల్లా బెల్లంకొండకు చెందినవాడిగా గుర్తించారు. అతనితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన సిరిగిరి బాబు, పస్తం రాజు, వరంగల్‌కు చెందిన అల్లం గోపి కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా ద్వారా పూజలు చేస్తామని చెప్పి మోసం చేసే వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయం

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

బాలికపై లైంగిక దాడి 
1
1/2

బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడి 
2
2/2

బాలికపై లైంగిక దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement