
కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం
మానవపాడు: జాతీయ రహదారి–44పై ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద కర్నూలు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చొని ఉన్న వ్యక్తి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణయ్యగౌడ్ (50) సోమవారం తెల్లవారు జామున 1 గంట సమయంలో ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సొంత కారు పంక్చర్ అవ్వగా లిఫ్ట్ కోసం రోడ్డుపై నిల్చున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. చెక్‌పోస్టు సిబ్బంది చికిత్స నిమి త్తం కృష్ణయ్యగౌడ్‌ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
భూత్పూర్: మండలంలోని మద్దిగట్ల గ్రామాని కి చెందిన రాజు(35) సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తండ్రి బాలకిష్ట య్య తెలిపారు. పూర్తి వివరాలు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురానికి చెందిన రాజు ఆదివా రం కూలీ పని నిమిత్తం వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం పురుగు మందు తాగి అపస్మారిక స్థితిలో ఉండగా గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడి తండ్రి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చెట్టు పైనుంచి జారిపడి యువకుడి మృతి
జడ్చర్ల: సీతాఫలాలను తెంపేందుకు చెట్టుపైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన రామురాం కాష్యప్(22) బోర్‌వెల్ పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం పెద్దరేవల్లి సమీపంలో సీతాఫలాలు తెంపేందుకు చె ట్టు ఎక్కాడు. పండ్లు తెంపుతూ జారి దాదా పు 15 అడుగుల లోతు గుంతలో పడడంతో తీ వ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సోమవారం మృతుడి బావ దుర్గా రాం మార్కమ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
చారకొండ: ఇంటి మిద్దె పైనుంచి జారి కిందపడిన ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సారంబండతండాకు చెందిన ఇస్తావత్ ధన్‌కోటి(44) పదిరోజుల కిందట తన ఇంటి మీద నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తలకు తీవ్రగాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మహిళ మృతదేహం లభ్యం
పెంట్లవెల్లి: మండలంలోని మంచాలకట్ట సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద చాకలి రాము డు గట్టు వద్ద మహిళ శవం ఉందని బర్రెల కాపరి గమనించి స్థానికులకు తెలియజేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వవగా.. ఎస్‌ఐ రామన్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మృతదేహం మహిళదని.. మహిళ వయసు 30నుంచి 40 ఏళ్లమధ్యలో ఉండవచ్చని తెలియజేశారు. మహిళను పెట్రో ల్ పోసి కాల్చినట్లు తెలియజేశాడు. శవాన్ని పోస్ట్‌మార్టం చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని, దుండగులను కచ్చితంగా పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
మహిళ అదృశ్యం:
కేసు నమోదు
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళ అదృశ్యంపై సోమ వారం కేసు నమోదైనట్లు ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన స్వాతి భర్తతో గొడవ పడి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొట్రలో వృద్ధుడు..
వెల్దండ: కొట్రకు చెందిన వృద్ధుడు పోనుగంటి అర్జున్‌రావు(65) అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. ఎస్‌ఐ కురుమూర్తి తెలిపిన వివరాలు.. అర్జున్‌రావు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి ఎంతకి రాకపోవడంతో అర్జున్‌రావు సోదరుడు కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం