
జూరాలకు భారీగా తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద రోజురోజుకు భారీగా తగ్గుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 55 వేల క్యూసెక్కులు ఉండగా.. సోమవా రం రాత్రి 8 గంటలకు 43 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. నెట్టెంపాడు ఎత్తిపోతలలో ఒక పంపును ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపుతున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి నిమి త్తం 45,177 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.029 టీఎంసీలు ఉందన్నారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో సో మవారం ఉత్పత్తి కొనసాగిందని ఎస్‌ఈ శ్రీధర్, డీ ఈ పవన్‌కుమార్ తెలిపారు. సోమవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, దిగువ 6 యూని ట్ల నుంచి 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 821 .177 మి.యూ.ఉత్పత్తి సాధించామని చెప్పా రు.
శ్రీశైలంలో 884.3 అడుగుల నీటిమట్టం..
శ్రీశైలం జలాశయంలో సోమవారం 884.3 అడుగుల వద్ద 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,177 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,958 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరిందన్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,236 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు వదులుతున్నట్లు చెప్పారు. భూగర్భ కేంద్రంలో 17.101 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.689 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వ కు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.