
మక్తల్: నిత్యం రద్దీగా ఉండే మాద్వార్ రోడ్డులో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయడం కలకలం రేపాయి. మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మూడుదారులు కలిసిన చోట నడిరోడ్డుపై మేకను బలిచ్చారు. అంతేగాక, గుమ్మడికాయను పగలగొట్టి కుంకుమ, పసుసు, నిమ్మకాయలు వేశారు. దీంతో మా ద్వార్ గ్రామస్తులతోపాటు అటుగా వెళ్లే ఇతర గ్రా మాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మాద్వార్ గ్రామానికి మూడు బాటలు ఉండగా.. లింగంపల్లి నుంచి వచ్చే మార్గంలో గుమ్మడికాయ, పసుపు, కుంకుమల, సంగంబండ వెళ్లే మార్గంలో నిమ్మకాయలు, వివిధ సామగ్రితో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేశారు. పూజలు చేసిన చోట కత్తి, ఇతర వస్తువులు అలాగే వదిలి వెళ్లారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం అటుగా వెళ్లే గ్రామస్తులు ఈ దృశ్యాలను చూసి భయాందోళనకు గుర య్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. క్షుద్రపూజలు చేసిన చోట పోలీసుల సమక్షంలో గడ్డితో గ్రామస్తులు కాల్చారు. బలిచ్చిన మేకను కుక్కలు లాక్కెళ్లాయి.
మంత్రగాళ్లపైనే అనుమానాలు..
ఇదిలాఉండగా, ఈ క్షుద్రపూజలు మంత్రగాళ్ల పనే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా మంతగ్రాళ్లను సంప్రదించి ఉండవచ్చునని, వారి ఆధ్వర్యంలోనే ఇలా క్షుద్రపూజలు చేయాలని, మేకను బలి ఇవ్వాలని ఆదేశించి ఉంటారా అని అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై ఇలా చేసిన వారు ఏ గ్రామానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇలాంటి ఘటన గ్రామంలో ఎప్పుడు జరగలేదని, నిత్యం వ్యవసాయ కూలి పనులకు ఈ మార్గంలోనే వెళ్తుంటామని, క్షుద్రపూ జలు చేయడంతో ఎలా వెళ్లేదని మహిళలు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే, మంత్రగాళ్లు, క్షుద్రపూజలను ఎవ రూ నమ్మవద్దని, ప్రజలు ధైర్యంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా ఇలాంటి పనులు చేసినట్లు అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు లు సూచించారు.