
విద్యుత్ ఆదా..
యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో సోలార్ విద్యుత్ వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రూ.3 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవనం పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా యూనివర్సిటీలోని పలు విభాగాలకు సోలార్ విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వం అందించే సాధారణ విద్యుత్‌తో కలుపుకొని అన్ని విభాగాలకు అందిస్తున్నారు. దీని ద్వారా యూనివర్సిటీకి తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొన్ని విభాగాలకు సరిపోవడం లేదని, దీనిని పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు పేర్కొంటున్నారు.