
రూ.10వేలతో మొదలై రూ.450కోట్ల టర్నోవర్
● శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి
● ఘనంగా శ్రీరామ జయరామ
51వ వ్యవస్థాపక దినోత్సవం
పాలమూరు: 1974లో రూ.10వేల పెట్టుబడితో మొదలైన శ్రీరామ జయరామ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రూ.450కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరిందని సంస్థ అధినేత బెక్కరి రాంరెడ్డి అన్నారు. శ్రీరామ జయరామ 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. ఈ సంస్థల ద్వారా 1200మంది ఉద్యోగులతో కలిసి రైతులకు సేవలు అందిస్తున్నామని, 1984లో మహీంద్ర ట్రాక్టర్ డీలర్ షిప్ తీసుకుని ఇప్పటివరకు 40వేల ట్రాక్టర్లు విక్రయించామన్నారు. ఇదే ఏడాది టీవీఎస్ ద్విచక్ర వాహనాల డీలర్ షిప్ తీసుకుని 20వేల వాహనాలు విక్రయించినట్లు వెల్లడించారు. 2012లో మారుతీ కార్ల డీలర్ షిప్ తీసుకొని ఇప్పటివరకు 20వేలకు పైగా కార్లు విక్రయాలు చేశామన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఆస్పత్రి ద్వారా 3వేల మంది రోగులకు ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. అనంతరం 50 ఏళ్ల యాత్రలో సహకరించిన అందరినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ బెక్కరి జయలక్ష్మి, మహీంద్ర జోనల్ సేల్స్‌హెడ్ ఇంద్రకంటి అరవింద్, ఏరియా సీనియర్ మేనేజర్ శెట్టి ఉదయ్, డిప్యూటీ మేనేజర్ యాసిప్త్, సంస్థ సీఈవోలు సరసయ్య, విక్రమ్‌యాదవ్, నాగేంద్ర, మారుతీ షోరూం జీఎం వేణుగోపాల్‌రెడ్డి, రామకృష్ణ, తుకారం, రామదాసు, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌తో 1200మంది ఉద్యోగులు పాల్గొన్నారు.