
ప్రియాంక మృతిపై న్యాయ విచారణ చేయాలి
గద్వాల క్రైం: కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన చెందిన ప్రియాంక మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని బుధవారం కుటుంబ సభ్యులు ఆదిలక్ష్మి, రాంబాబు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4న ప్రియాంక విషపు గుళికలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతురాలి నడుము వద్ద మత్తు లేదా పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడంతోనే మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈ విషయమై డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ ప్రియాంక కేసు విషయంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. గద్వాలకు వస్తున్న క్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా.. రోడ్డు మార్గంలో ఆలస్యం తదితర విషయాలపై ఆరా తీస్తామన్నారు. ప్రియాంక ఆత్మహత్యకు ఎవరైన ప్రేరేపించారా.. లేక రఘునాథ్‌గౌడు కు టుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారా.. మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తుల చేతుల్లో మోసపోయిందా.. ఆర్థికపరమైన రాజీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనలు జరిగాయా.. అనే కోణాల్లో విచారణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం, ఫోరె న్సిక్ ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉందని, వాటి ఆ ధారంగా విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడని, త్వ రలోనే మరికొందరిపై విచారణ చేపట్టి వారిని సైతం రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ చెప్పారు.