
వినూత్న ఆలోచన..!
● టెండర్లు పెంచడానికి దుకాణాల వారీగా అమ్మకాల వివరాలు వెల్లడి
● సోషల్‌మీడియాలో వివరాలు పెట్టి.. వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు బుధవారం 41 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో మహబూబ్‌నగర్‌లో 17, నారాయణపేటలో 4, వనపర్తిలో 2, నాగర్‌కర్నూల్‌లో 17, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒక టెండర్ వచ్చాయి. 12 రోజుల తర్వాత వనపర్తి, గద్వాల జిల్లాలో దరఖాస్తుల ఖాతా ప్రారంభం కావడం విశేషం. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్, పేటలో కలిపి 21, నాగర్‌కర్నూల్‌లో 41, వనపర్తిలో రెండు, గద్వాల జిల్లాలో ఒకటి కలిపి.. మొత్తం 65 టెండర్లు వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని ఎకై ్సజ్ అధికారులు మద్యం వ్యాపారుల్లో టెండర్లు వేయడంలో ఆసక్తి పెంచడానికి వినూత్నంగా ఆలోచనలు మొదలుపెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో దుకాణాల వారీగా జరిగిన మద్యం అమ్మకాల వివరాలను సోషల్ మీడియా, వాట్సప్‌లలో షేర్ చేస్తున్నారు. దీంతో దుకాణాల వారీగా రెండేళ్ల కాలంలో జరిగిన మద్యం అమ్మకాల ఆధారంగా వచ్చిన లాభాలపై లెక్కలు వేసుకుని టెండర్లు వేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.