
జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే ఎంపీటీసీ స్థానాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో మొదటివిడత జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ విజయేందిర రిటర్నింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలతో వీసీ నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న 8 జెడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఎలాంటి విరుద్ధచర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నోటీస్ జారీ చేసి నిర్దేశిత ప్రాంతంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్‌తో వీసీ నిర్వహించారు. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసుదన్ నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ పార్థసారధి, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
గండేడ్
10
బాలానగర్
12
భూత్పూర్
10
మహమ్మదాబాద్
10
మిడ్జిల్
9
జడ్చర్ల
15
రాజాపూర్
8
నవాబుపేట
15