
దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
● డీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐసీసీ నేతృత్వంలో ఓటు చోరీపై సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రతి గ్రామంలో 100 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకుందామని, ఓటు చోరీని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్, జహీర్ అఖ్తర్, ఎన్‌పీ.వెంకటేశ్, వసంత, సీజే బెనహర్, సిరాజ్‌ఖాద్రీ, సాయిబాబా, ఫయాజ్, అజ్మత్‌అలీ, అవేజ్, అబ్దుల్ హక్ పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమాలకు రాకపోతే బీఫాంలు రావు
పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని డీసీసీ అధ్యక్షుడు అన్నారు. కార్యక్రమాలకు కొంతమంది డుమ్మా కొడుతున్నారని, భవిష్యత్‌లో కాంగ్రెస్ తరపున సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా నిలబడాలనుకునే వారు పార్టీ కార్యక్రమాలకు రాకుండా ఇంట్లో కూర్చొని బీఫాంలు వస్తాయన్నది పగటికల అని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా బీఫాంలు వస్తాయనుకుంటే జరగని పని అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొంటున్నారనే వివరాలను ఏఐసీసీ పరిశీలకులు గమనిస్తున్నట్లు తెలిపారు. అందరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.