
11న పీయూలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూని వర్సిటీలో ఈ నెల 11న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అడ్మినిస్ట్రేషన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో బల్క్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. వివిధ ఫార్మా కంపెనీల్లో ఖాళీల భర్తీకి డ్రైవ్ చేపడుతున్నామని.. 2021 నుంచి 2025 విద్యాసంవత్సరం వరకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మ, బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు ఇంటర్మీడియట్, ఐటీఐ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను గూగుల్ ఫాంలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే 200కు పైగా యువత తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ప్లేస్‌మెంట్ అధికారి అర్జున్‌కుమార్ (సెల్‌నంబర్ 98494 45877) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీఆర్వో గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు
మేనేజర్, కోచ్‌గా జిల్లావాసులు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 40వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాలుర అథ్లెటిక్స్ జట్టుకు మేనేజర్‌గా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర, కోచ్‌గా సునీల్‌కుమార్ ఎంపికయ్యారు. వీరు జట్టు క్రీడాకారులతో కలిసి బుధవారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. వీరి ఎంపికపై జిల్లా అథ్లెటిక్స్ సంఘం, సీనియర్ అథ్లెట్లు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్ రిమాండ్
గద్వాల క్రైం: దళిత యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, ఆమె మృతికి కారకుడైన కానిస్టేబుల్ రఘునాథ్‌గౌడ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కొత్తగూడెం పాల్వంచకు చెందిన దళిత యువతి కోలెటి ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్‌గౌడ్ ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉదోగ్యం కోసం శిక్షణ కేంద్రంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందన్నారు. ఈ క్రమంలో రఘునాథ్‌గౌడ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉదోగ్యం పొందాడు. దీంతో ప్రియాంక తనను వివాహం చేసుకోవాల్సిందిగా రెండు నెలల క్రితం రఘునాథ్‌గౌడ్, వారి కుటుంబ సభ్యులను కోరగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రియాంక మాత్రం తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చి చిన్నోనిపల్లిలో వారి ఇంట్లోనే ఉంటుంది. రెండు నెలలు అయినప్పటికీ రఘునాథ్‌గౌడ్, వారి కుటుంబ సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఈ నెల 4న విషం గుళికలను తీసుకొని, గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. యువతి మృతికి కారకులైన కానిస్టేబుల్, వారి కుటుంబ సభ్యులపై గట్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఏ–1 రఘునాథ్‌గౌడ్‌ను పోలీసుశాఖ సర్వీస్ నుంచి తొలిగించిందన్నారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని అలంపూర్ కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలో మరి కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. వారందరిపై ఎస్సీ, ఎస్టీ తదితర బీఎన్‌ఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు.
కోచ్‌గా సునీల్‌కుమార్
మేనేజర్‌గా శరత్‌చంద్ర

11న పీయూలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్

11న పీయూలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్