
నెరవేరనున్న చిరకాల స్వప్నం
జడ్చర్ల: జడ్చర్ల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరేందుకు బీజం పడింది. జడ్చర్లలో ట్రాఫిక్ దిగ్భందనం ఛేదించేందుకు పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనల అడుగులు ముందుకు కదిలాయి. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, జా తీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎంపీ డీకే అరుణతోపాటు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కలిసి జడ్చర్ల బైపా స్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సానుకలంగా స్పందించిన కేంద్రమంత్రి నుంచి తమకు ఓ లేఖ అందిందని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మంగళవారం తమకు వచ్చి న లేఖను విడుదల చేశారు. జడ్చర్ల చుట్టూ, ఓవైపు 44వ నంబర్ జాతీయ రహదారి మరోవైపు 167వ నంబర్ జాతీయ రహదారి ఉండడంతో ఆయా రహదారులను కలిపి జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డును నిర్మించే విధంగా డీపీఆర్(డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించడానికి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా జడ్చర్ల మీదుగా వెళ్తున్న 167 నంబర్ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్‌ను తయారు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళికను రూపొందించి నిధులు మంజూరు చేసేవిధంగా కృషిచేస్తామన్నారు. రెండు జాతీయ రహదారుల ట్రాఫిక్‌తోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించడంపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ఆఆర్‌అండ్‌బీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎంపీ డీకే అరుణ తదితరులు ఇందుకు సహకరిస్తున్నారని కొనియాడారు. బైపాస్ రోడ్డుతోపాటు నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణతో జడ్చర్ల ముఖచిత్రం మారిపోతుందన్నారు.
జడ్చర్లకు బైపాస్ డీపీఆర్‌కు
రంగం సిద్ధం
4 లైన్లుగా 167జాతీయ రహదారికి కూడా..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నుంచి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి లేఖ