
రాష్ట్రస్థాయిలో జిల్లాపేరు నిలబెట్టాలి
జడ్చర్ల టౌన్: అండర్–19 ఫుట్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నీలో రాణించి జిల్లాపేరు నిలబెట్టాలని ఎంఈఓ మంజులాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మినీ స్టేడియం మైదానంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈనెల 10 నుంచి 12వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికై న 18మందిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శారదభాయి, పీడీ, పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు వడెన్న, కృష్ణయ్య, పీడీలు భానుకిరణ్, మోయిన్, జ్యోతి పాల్గొన్నారు.