
సరళాసాగర్‌ను సందర్శించిన ఢిల్లీ బృందం
మదనాపురం: ప్రసిద్ధ సరళాసాగర్ ప్రాజెక్టును మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ అధికారుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం, ప్రస్తుతం కొనసాగుతున్న లీకేజీలు, ఉడ్ సైఫన్ భాగంలో నీటి లీకేజీలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్షించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించింది. లీకేజీల నివారణకు అవసరమైన మార్గాలను చర్చించారు. ప్రాజెక్టు ఉడ్ సైఫన్ భాగం, గ్రావిటీ డ్యాంపై ప్రత్యేక దృష్టి సారించి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డ్యామ్ సేఫ్టీ నిపుణులు అశోక్ కుమార్ గంజూ, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ డాక్టర్ పి.రామరాజు, చీఫ్ ఇంజినీర్ టి.ప్రమీల, సీనియర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌తోపాటు జగన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.