
గంజాయి విక్రేతల అరెస్టు
జడ్చర్ల: గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి గుట్టుగా విక్రయిస్తున్న ముగ్గురు విక్రేతలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బాలానగర్ మండల పరిధి లోని గుండెడు– ఉడిత్యాల రహదారిలోని కిరా ణ దుకాణంలో నిర్వహించిన తనిఖీలో 1.20 కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. విక్రే తలు వి.కిషన్, నేనావత్ కృష్ణా, నేనావత్ లాలి ను అరెస్ట్ చేశామన్నారు. హైదరాబాద్ నుంచి ఎండు గంజాయిని రూ.15 వేలకు కేజీ చొప్పు న కొనుగోలు చేసి ఆరు గ్రాముల పాకెట్లను తయారు చేసి ఒక్కో పాకెట్‌ను రూ. 400కు కా ర్మికులకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయితో పాటు, రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడు ల్లో ఎస్‌ఐలు కార్తీక్‌రెడ్డి, నాగరాజు, సిబ్బంది సిద్దార్థ, స్నేహలత, సునీత పాల్గొన్నారు.