
వీకేర్ సీడ్స్ కంపెనీపై ఐటీ దాడులు
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి పక్కనున్న వీకేర్ సీడ్స్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆదా య పన్నులశాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 6 కార్లలో 22మంది అధికారులు తెల్లవారుజామునే సదరు కంపెనీకి చేరుకున్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఉదయం 6గంటలకే విధులకు హాజరుపరిచారు. కంపెనీలో పలు డాక్యుమెంట్లు తనిఖీ చేసినట్లు సమాచారం. అదే విధంగా కంపెనీ యజమానులు వెంకట్రావు, కోటిస్వామి, కిరణ్, రాజశేఖరప్ప, బాబయ్య ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.