
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే సీనియర్ విభాగం జాతీయస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు మంగళవారం తెలిపారు. 18– 21 సంవత్సరాల విభాగంలో నందిని, కావేరి, 21–25 విభాగంలో స్వప్న, సాగర్, ఆకాశ్, 25–35 విభాగంలో బాలమణి, 35–45 విభాగంలో వెంకటేష్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.