
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంపై అవగాహన
పాలమూరు: మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఏదైనా సమస్యలు వస్తే మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం–2017ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం పలు రకాల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల చట్టం–2016తో ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు, మేధో దివ్యాంగులు, మహిళల రక్షణ గృహాలను వారి హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజా, మెడికల్ ఆఫీసర్ నరేష్‌చంద్ర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఎస్‌జీఎఫ్‌తైక్వాండో ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల తైక్వాండో బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, 17 విభాగాల బాలబాలికలు పాఠశాల బోనఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్, నాలుగు ఎలిజిబిలిటి ఫారాలు, అండర్–19 విభాగం వారు పదోతరగతి మెమో, బోనఫైడ్, ఆధార్ జిరాక్స్, నాలుగు ఎలిజిబిలిటి ఫారాలతో ఉదయం 9 గంటలకు సురేందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.
నాయకత్వ లక్షణాలుఅలవర్చుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పీయూలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ –1, 5, 7 శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిశుభ్రత పాటించడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పీయూను గ్రీన్ క్యాంపస్‌గా మార్చేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో పాల్గొనడం వల్ల విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, ప్రోగ్రాం అధి కారి రవికుమార్, శివకుమార్‌సింగ్, జ్ఞానేశ్వర్, వెంకటేశ్, పీడీ శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.
కోర్టులో చీటింగ్‌కు పాల్పడిన అధికారి
● విచారణ అనంతరం
14 రోజుల రిమాండ్
మహబూబ్‌నగర్ క్రైం: కోర్టులో పని చేసే ఉద్యోగి తన విధుల దుర్వినియోగానికి పాల్పడి ఫోర్జరీతో పాటు చీటింగ్ చేసిన కేసులో టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఎన్.శ్రీనివాసులు 2018 నుంచి 2020 మధ్య కాలంలో తన విధులను దుర్వినియోగానికి పాల్పడుతూ కక్షిదారులకు విడుదల చేయాల్సిన డబ్బుల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. అలాగే సీనియర్ సివిల్ జడ్జి సంతకం ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేశారు. దీంతో అతని విధుల నుంచి తొలగించడంతో పాటు మే 21న కోర్టు నుంచి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసి శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు.
హంసధాన్యం @ రూ.1,789
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటాల్ రూ. 1,789 ధర పలికింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం 200 బస్తాల హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నారు. అయితే కొన్ని వారాలుగా ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ వారం ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం వేలం ద్వారా తెలియనుంది.

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంపై అవగాహన