
రైస్‌మిల్లులో షార్ట్ సర్క్యూట్
ఖిల్లాఘనపురం: షార్ట్‌సర్క్యూట్‌తో రైస్‌మిల్లు మోటార్లు, ప్యానల్ బోర్డు దగ్ధమైన ఘటన మండలంలోని సోళీపురంలో మంగళవారం జరిగింది. మిల్లు యజమాని నందకిశోర్ తెలిపిన వివరాలు.. గ్రామంలోని ఐశ్వర్య రైస్‌మిల్లులో మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మిల్లు నుంచి పొగలు రావడంతో స్థానికులు యజమానికి సమాచారం ఇచ్చారు. మిల్లు వద్దకు చేరుకున్న యజమాని పరిశీలించగా మూడు మోటార్లు, ప్యానల్ బోర్డు, వైరింగ్ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించాడు. సుమారు రూ.20 లక్షల వరకు నష్టం జరిగిందని మిల్లు యజమాని తెలిపారు.
పోలీసులపై దాడి.. ముగ్గురికి రిమాండ్
జడ్చర్ల: పోలీసులపై దాడి చేసిన నిందితులకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గొడవ జరుగుతుందని ఆదివారం రాత్రి ఫిర్యాదు అందింది. దీంతో గొడవను నిలువరించడానికి వెళ్లిన పోలీసులపై వల్లూరు శ్రీకాంత్, బద్రి, పానుగంటి బాబులు దాడి చేయడంతో పాటు విధులకు ఆటంకం కల్పించారు. పోలీసు కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
రూ.20 లక్షల ఆస్తి నష్టం