
కాల్వలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు
తిమ్మాజిపేట: మండలంలోని బాజీపూర్ సమీపంలో కాల్వలో సోమవారం రాత్రి కొట్టుకుపోతున్న వ్యక్తిని గ్రామస్తులు కాపాడారు. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకాయపల్లికి చెందిన వెంకటయ్య మేసీ్త్ర పనికి కుటుంబంతో బాజీపూర్ వెళ్లాడు. పనులు ముగించుకొని భార్య, కుమారుడితో బైక్‌పై రాత్రి 7.30 గంటలకు తిరుగు ప్రయాణంలో గొల్లవాని బావి దగ్గర కాల్వ దాటేందుకు ప్రయత్నించాడు. భార్య, కుమారుడు బైక్‌పై నుంచి దూకి కాల్వ ఒడ్డుకు చేరగా వెంకటయ్య కాల్వలో కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో గ్రామస్తులు పలువురు గుర్తించి తాళ్ల సాయంతో కాల్వలో కొట్టుకు పోతున్న వెంకటయ్యను కాపాడారు. భారీ వర్షంతో గ్రామంలోని వీధులు కాల్వను తలపించాయి.