
ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి
హన్వాడ: ప్రజా సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి జడ్జి, ప్రిన్సిపల్ జడ్జి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం హన్వాడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్ రవిశంకర్, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీఓ యశోద, డిఫెన్స్ కౌన్సిల్ రవినాయక్, యోగేశ్వర్‌రాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి