
హైవేపై తప్పిన ప్రమాదం
ఎర్రవల్లి: 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను బొలెరో ఢీ కొట్టడంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై మురళి కథనం ప్రకారం.. ఘట్కేసర్ నుంచి తొమ్మిది మంది కూలీలతో బొలెరో బెంగళూరుకు వెళ్తుంది. శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో వెళ్తుండగా.. బొలెరో బ్రేక్‌డౌన్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్‌ను అదుపు తప్పి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరో వెనకాలే 40మంది ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పల్టీ కొట్టడంతో అందులోని ప్రయాణికులంతా తేలికపాటి గాయాలతో బయటపడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
● ట్యాంకర్‌ను ఢీకొన్న బొలెరో
● ఆరుగురికి తీవ్ర గాయాలు