పెంకుటిల్లు కూలి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పెంకుటిల్లు కూలి బాలుడు మృతి

Sep 28 2025 8:28 AM | Updated on Sep 28 2025 8:28 AM

పెంకు

పెంకుటిల్లు కూలి బాలుడు మృతి

ముగ్గురు చిన్నారులకు తప్పిన ముప్పు

మక్తల్‌: జూరాల వెనుక జ లాల్లో ముంపునకు గురైన మండలంలోని అనుగొండలో శనివారం పెంకుటి ల్లు కూలి ఓ బాలుడు మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామాని కి చెందిన సురేష్‌, జమున దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నాయి. పెద్ద కుమా రుడు ఆదిత్య (10) హైదరాబాధ్‌లో అవ్వ దగ్గర ఉండి 5వ తరగతి చదువుకుంటుండగా.. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. శనివారం తోటి ముగ్గురు స్నేహితులతో కలిసి ఇంటి పక్కనే ఉన్న పెంకుటింట్లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఆదిత్య పెంకుల మధ్యన ఇరుక్కుపోగా మిగతా వారు బయటకు పరుగెత్తారు. చుట్టపక్కల వారు అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రి సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.

విద్యార్థిపై దాడి

కేసులో రిమాండ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: పాలిటెక్నిక్‌ విద్యార్థిపై జరిగిన దాడి కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు. దాడి కేసు వివరాలను శనివారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ అప్పయ్య వెల్లడించారు. మూసాపేటకు చెందిన సాయిచరణ్‌ తన స్నేహితులు అఖిల్‌, మూర్తి, రామ్‌చరణ్‌తో కలిసి ఈ నెల 16న సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి బస్టాండ్‌కు వెళ్లడానికి బండ్లగేరి మీదుగా వస్తున్నారు. గణేష్‌నగర్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శివ, మల్లేష్‌, హర్ష అనే ముగ్గురు యువకులతో పాటు మరికొందరు కలిసి సాయిచరణ్‌ అతని స్నేహితులను అడ్డగించి రూ.20 కావాలని అడిగారు. ఈ క్రమంలో విద్యార్థులు డబ్బులు లేవని వెళ్లిపోతుండగా సాయిచరణ్‌పై మల్లేష్‌, శివ దాడి చేశారు. బాధితుడికి తీవ్రగాయం కావడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. శనివారం రైల్వే స్టేషన్‌లో దాడి చేసిన యువకులు శివ, హర్షను అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు రిమాండ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: మద్యం తాగిన తర్వాత ఇంటి దగ్గర విడిచిపెడతాం అంటూ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిపై దాడి చేసి సెల్‌ఫోన్‌, బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కే సులో టూటౌన్‌ పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. తిర్మలాయిపల్లికి చెందిన నరేష్‌, శ్రీకాంత్‌, రామస్వామి ముగ్గురు కలిసి ఈ నెల 26న రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని పాలమూరు మద్యం దుకాణంలో మద్యం తా గుతున్న క్రమంలో మె ట్టుగడ్డకు చెందిన బీఎంఎస్‌ వైద్యుడు నర్సింహతో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత నలుగురు కలిసి మద్యం తాగిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో నర్సింహను ఇంటి దగ ్గర విడిచిపెడుతాం అంటూ బైక్‌పై ఎక్కించుకుని ఎదిర శివారుకు తీసుకువెళ్లి అతనిపై దాడి చేసి ఫోన్‌, బ్యాగ్‌ ఎత్తుకువెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

పెంకుటిల్లు కూలి  బాలుడు మృతి 
1
1/1

పెంకుటిల్లు కూలి బాలుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement