
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
● అడ్డాకుల వద్ద హైవేపై లారీని ఢీకొట్టుకున్న ట్రాలీ ఆటో
● యజమాని సహా 48 గొర్రె పొట్టేళ్ల మృతి
అడ్డాకుల: అడ్డాకుల శివారులోని 44వ నంబర్ జా తీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రు మృతి చెందగా.. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం దామా జుపల్లికి చెందిన ఆది నారాయణ(62) గొర్రె పొట్టేళ్లను పెంచాడు. దసరా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వాటిని అమ్ముకోవాలని ట్రాలీ ఆటోలో 84 గొర్రె పొట్టేళ్లను ఎక్కించుకుని శుక్రవారం డ్రైవర్ క మతం కాటమయ్యతో కలిసి హైదరాబాద్‌కు బయ లు దేరాడు. మార్గమధ్యంలో అడ్డాకుల శివారులోని శివయాదవ్ హోటల్ సమీపంలో తెల్లవారుజామున ముందు వెళ్తున్న రాజస్థాన్ లారీని వెనుకనుంచి ట్రాలీ ఆటో ఢీకొట్టుకుంది. దీంతో ఆటో క్యాబిన్ నుజ్జునుజ్జవడంతో ఇద్దరు అందులోనే ఇరుక్కుపోయారు. ఎడమ వైపు కూర్చున్న ఆది నారాయణ దుర్మరణం చెందాడు. ఆటో డ్రైవర్ కమతం కాటమయ్య అందులో ఇరుక్కుపోగా పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో అతని కాలు విరిగింది. ప్రమాద ఘటనతో రోడ్డుపై చాలాసేపు ట్రా ఫిక్ నిలిచి పోయింది. టోల్‌ప్లాజా సిబ్బందితో కలిసి పోలీసులు ఆటోను రోడ్డు పక్కకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆది నారాయణ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తీసుకెళ్లారు. మృతుడికి భార్య ఆదెమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ఆటోలో 84 గొర్రె పొట్టేళ్లు ఉండగా ప్రమాదంలో 48 గొర్రె పొట్టేళ్లు మృతి చెందాయని, వాటి విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని మృతుడి కుమారుడు శివ తెలిపారు. ప్రమాద ఘటనపై శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం