
హోరాహోరీగా..
● రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్‌బాల్ పోటీలు
● సెమీస్‌కు మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, కరీంనగర్ జట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లను శనివారం జడ్చర్ల పట్టణంలో నిర్వహించారు. ఆతిథ్య మహబూబ్‌నగర్ పురుషుల జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 1–0 గోల్స్ తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ 1–0 గోల్స్ తేడాతో సిద్దిపేట జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది.
టై బ్రేకర్ ద్వారా ఫలితాలు
వనపర్తి–మెదక్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మ్యాచ్ సమయానికి చెరో జట్లు రెండేసీ గోల్స్ కొట్టగా టై బ్రేకర్ నిర్వహించారు. ఈ టై బ్రేకర్‌లో వనపర్తి జట్టు 4–3 గోల్స్ తేడాతో మెదక్ జట్టుపై గెలుపొందింది. మరో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో గద్వాల–ఆదిలాబాద్ జట్లు గోల్స్ చేయకపోవడంతో టై బ్రేకర్ నిర్వహించారు. గద్వాల జట్టు 3–1 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలుపొంది సెమీస్‌లో ప్రవేశించింది.
సెమీఫైనల్ మ్యాచ్‌లు
మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ వర్సెస్ వనపర్తి, రెండో సెమీస్‌లో గద్వాల వర్సెస్ కరీంనగర్ జట్లు తలపడనున్నాయి.
లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు
అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో సిద్దిపేట జట్టు 2–1 గోల్స్ తేడాతో నల్గొండపై, మెదక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గద్వాల జట్టుపై, రంగారెడ్డి జట్టు 6–0 గోల్స్ తేడాతో సిద్దిపేట జట్టుపై, గద్వాల జట్టు 4–0 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించాయి. వనపర్తి–ఆదిలాబాద్, మహబూబ్‌నగర్–కరీంనగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో నిర్ణీత సమయంలో జట్లు గోల్స్ చేయకపోవడంతో డ్రాగా ముగిశాయి.
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఉ మ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫు ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అ న్నారు. జడ్చర్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో శనివారం క్రీడాకారుల ను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి స్వ యంగా క్రీడాకారుడు అయినందున క్రీడలకు అ త్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణస్థాయిలో క్రీడాకారుల ను ప్రోత్సహించడానికి సీఎం కప్ నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. వర్షం పడుతున్నప్పటికీ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బా ల్ అసోసియేషన్ సభ్యులు గజానంద్‌కుమార్, నాగేశ్వర్, నంద కిషోర్, జడ్చర్లకు చెందిన కృష్ణయ్య, మోయిన్, శ్రీనివాస్, శ్రీహరి, జేమ్స్, రామకృష్ణ, రాంరెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.