
లక్కీడిప్ ద్వారా ‘ప్రాదేశిక’ రిజర్వేషన్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో ముందడుగు పడింది. ఇందులో ముఖ్యమైనది రిజర్వేషన్ ప్రక్రియ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 9ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ విజయేందిర ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ ప్రక్రియ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కొనసాగిన తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్‌ల రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు.