
చోరీల కట్టడికి గస్తీలు
● రాత్రివేళ పెట్రోలింగ్, బ్లూకోర్ట్స్ వాహనాలు తిరిగేలా చర్యలు
● జిల్లాకేంద్రంలో 250 ఎన్‌పీఆర్, 110 వైర్‌లెస్ కెమెరాల ఏర్పాటు
● ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు మెడలో వేసుకోరాదు
● ఇళ్లకు తాళం వేసే దాంట్లో కూడా జాగ్రత్తలు అవసరం
● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్ క్రైం: దసరా పండగ నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో విలువైన వస్తువులు చోరీ కాకుండా, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పలువురు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. వివరాలిలా..
● ప్రశ్న: మహబూబ్‌నగర్ బైపాస్, ఏనుగొండ మార్గాల్లో రాత్రివేళ ఓపెన్ డ్రికింగ్ ఉంటుంది. దీంతో ఏనుగొండ నుంచి బైపాస్, హౌసింగ్ బో ర్డు, ఎదిర రోడ్డు మార్గాల్లో మహిళలు వెళ్లడం కష్టంగా ఉంది. – కల్యాణి, హౌసింగ్ బోర్డు
● డీఎస్పీ: ఏనుగొండ నుంచి బైపాస్, ఎదిర రోడ్డు మార్గాల్లో రాత్రివేళ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి గస్తీ పెంచి ఆరుబయట మద్యం తాగకుండా చర్యలు తీసుకుంటాం.

చోరీల కట్టడికి గస్తీలు