
పనిచేసిన చోటే కన్నం
● దుకాణంలో రూ. 4లక్షల నగదు చోరీ
● ఏడుగురి అరెస్టు.. రిమాండ్
● మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్ క్రైం: ఆర్థిక ఇబ్బందులతో తాను పనిచేసిన యాజమాని దుకాణంలో చోరీ చేయాలని పథకం వేసి.. స్నేహితులతో కలిసి భారీ మొత్తంలో నగదు కాజేశాడో వ్యక్తి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కోయిలకొండ మండలం వీరన్నపల్లికి చెందిన మోడిపాటి వదన్న కొన్ని రోజులపాటు కోయిలకొండకు చెందిన అబ్దుల్ అజీజ్ చౌష్ బజావీ వద్ద వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. ఆ తర్వాత అతడి వద్ద పని మానివేసి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మోడిపాటి వదన్నకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి..దీంతో గతంలో పనిచేసిన యాజమాని దుకాణంలో దొంగతనం చేయాలని పథకం వేసి.. బాలానగర్ మండలం ఏకై ్వపల్లికి చెందిన ముష్టి శ్రీనివాస్‌ను సంప్రదించాడు. ఆ తర్వాత ముష్టి శ్రీనివాస్ తన స్నేహితులైన వాల్యానాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్లు ముడావత్ సురేశ్, కాత్రావత్ సురేశ్, జడ్చర్ల పాత బజార్‌కు చెందిన మేసీ్త్ర మాణిమారి శేఖర్, గద్వాలకు చెందిన ఉప్పల ఉదయ్‌కుమార్‌తో కలిసి దొంగతనం చేయడానికి పథకం వేశారు. ఈ నెల 11న అర్ధరాత్రి కోయిలకొండలో ఉన్న అబ్దుల్ అజీజ్ చౌష్ బజావీ దుకాణంలో ఉన్న రూ.4లక్షల నగదు, ఒక కేజీ బరువు ఉండి బంగారం పూతకల్గిన గొలుసు చోరీ చేశారు. ఈ నెల 19న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కోయిలకొండ క్రాస్‌రోడ్డులో బంగారం పూత కలిగిన గొలుసు విక్రయించడానికి నిర్మల్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌తో కలిసి మిగిలిన ఆరుగురు ప్రయత్నం చేస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రాజేంద్రప్రసాద్‌పై నిర్మల్ జిల్లాలో పలు కేసులు ఉన్నాయి. అదుపులోకి తీసుకున్న ఏ–1 మోడిపాటి వదన్న, ఏ–2 ముష్టి శ్రీనివాసులు, ఏ–3 ముడావత్ సురేశ్, ఏ–4 కాట్రావత్ సురేశ్, ఏ–5 మణిమారి శేఖర్, ఏ–6 ఉప్పల ఉదయ్‌కుమార్, ఏ–7 రాజేంద్ర ప్రసాద్‌లను అరెస్టు చేసి.. వారి నుంచి రూ. 3.10లక్షల నగదు, ఒక కేజీ బంగారం పూతకల్గిన గొలుసు, ఐరన్ రాడ్లు, రెండు కార్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చగాా రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ తిరుపాజీ ఉన్నారు.