
పోతుల పద్మావతికి స్థానిక ధ్రువపత్రం జారీ
గట్టు: మాజీ మావోయిస్ట్, కేంద్ర కమిటీ సభ్యురా లు పోతుల పద్మావతి అలియాస్ కల్పన, అలియా స్ సుజాతక్కకు గట్టు రెవెన్యూ అధికారులు స్థానిక ధ్రువీకరణ పత్రాన్ని గురువారం జారీ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా ఆర్‌ఐ రాజు, అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేసి నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. తహసీల్దార్ విజయ్‌కుమా ర్ పోతుల పద్మావతి పెంచికలపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. 42 ఏళ్లు మావోయిస్టు పార్టీలో పని చేసిన పద్మావతి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు పునావాసం కింద ఆమెకు రూ. 25 లక్షల రివార్డు అందజేశారు. అయితే ఆమె ఇప్పటికి గ్రామానికి చేరుకోలేదు.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు.